Share News

ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:46 PM

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ‘ప్రజావాణి’కి సకాలంలో హాజరు కావాలి

- అధికారులకు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశం

- ప్రజల నుంచి 165 ఫిర్యాదులు

గద్వాల న్యూటౌన్‌, జనవరి 8 : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశపు హాలు లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ వివిధ ప్రాం తాలకు చెందిన ప్రజల నుంచి 165 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు నిషితంగా పరిశీలించి, వారంలోపు పరిష్కరించాలన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు ఉదయం 10.30 గంటలకు తప్సనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్‌, చీర్ల శ్రీనివాసులు, ఽఅధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలి

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అఽధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ధరఖాస్తుల కంప్యూటరీకరణ, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ అంశాలపై సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి పౌరసరఫరాశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. మంత్రి సూచనల మేరకు జాప్యం లేకుండా సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఏ మిల్లులో, ఎంత ధాన్యం పెండింగ్‌లో ఉందో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. మిల్లుల వారీ లక్ష్యాలు పూర్తి చేసేంత వరకు ప్రతీ రోజు మిల్లులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్‌, చీర్ల శ్రీనివాస్‌, డీఎస్‌వో రేవతి, సివిల్‌ సప్లై డీఎం విమల పాల్గొన్నారు.

పకడ్బందీగా డేటా ఎంట్రీ

అభయహస్తం ఆరు గ్యారెంటీల ధరఖాస్తుల డేటా ఎంట్రీ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఎంపీడీవోలను ఆదేశించారు. అన్ని మండ లాల ఎంపీడీవోలతో సోమవారం నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17 లోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తులపై రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కాపీలు, ఫోన్‌ నంబర్లు సరిగా ఉన్నాయో లేదా పరిశీలించి, పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. కొత్తరేషన్‌ కార్డు కోసం వచ్చిన దరఖాస్తు లను పరిశీలించాలన్నారు. డేటా ఎంట్రీ అపరేటర్లను పెంచాలని, గట్టు, అయిజ, వడ్డేపల్లి మండలాల్లో పనిని వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

సక్రమంగా విధులు నిర్వర్తించాలి

విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాలని, నమోదు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని తహసీ ల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే ఈ నెల 22 వరకు తహసీల్దార్లు, బీఎల్‌వోలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి ఎనిమిదిన ఓటరు తుది జాబితా విడుదల అవుతుందన్నారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్లో బీఎల్‌వోలు ఉండి, యువ ఓటర్లను గుర్తించి నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు, సిసెక్షన్‌ సూపరింటెండెంట్‌ నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:46 PM