Share News

పాఠశాలలకు ఏకరూప దుస్తులు పంపిణీ

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:04 PM

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులను స్వయం సహాయ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టి సంబంధిత పాఠశా లల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసినట్లు డీపీఎం అరుణాదేవి తెలిపారు.

పాఠశాలలకు ఏకరూప దుస్తులు పంపిణీ
తెలకపల్లిలో హెచ్‌ఎంలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తున్న డీపీఎం, ఎంఈవో

బిజినేపల్లి, జూన్‌ 7 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులను స్వయం సహాయ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టి సంబంధిత పాఠశా లల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసినట్లు డీపీఎం అరుణాదేవి తెలిపారు. బిజినేపల్లి మండల కేంద్రంలోని ఇందిరాక్రాంతి సమాఖ్య భవ నంలో వెల్గొండ, మంగనూర్‌, గౌరారం, శ్రీవాణి విద్యాలయం, వట్టెం, రూపులతండా, వైఎస్‌ కాలనీ, గౌరారం ఉర్దూ మీడియం పాఠశాల్లోని 524 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అం దజేసినట్లు ఆమె వివరించారు. 309 మంది బాలి కలు, 215 మంది బాలురకు సరిపడ ఏకరూప దుస్తులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రజిత, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఉన్నారు.

- చారకొండ : మండలంలో మండల మహి ళా సమాఖ్య టైలర్‌ సభ్యులు కుట్టిన 1,169 యూనిఫాంలను ఎంఈవో శంకర్‌నాయక్‌, ఎంపీడీవో ఇసాక్‌హుసేన్‌లకు అందించామని ఏపీఎం బాల చందర్‌ తెలిపారు. కార్యక్రమంలో సీఆర్‌పీ యాదయ్యగౌడ్‌, సీసీలు ఉన్నారు.

- ఉప్పునుంతల : మహిళా సంఘాలు తయారుచేసిన ఏకరూప దుస్తులను ఎమ్మార్సీ భవనంలో మహిళా సంఘాల ప్రతినిధులు ఏపీ ఎం సైదులుతో కలిసి ఎంఈవో రామారావుకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎం మాట్లాడుతూ మండలంలోని పెద్దాపూర్‌, మొల్గర, కొత్తరామ్‌నగర్‌, పిరట్వాన్‌పల్లి, రాయిచెడ్‌, గట్టుకాడిపల్లి, పూర్యనాయక్‌తండా, సీబీ తండా పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.

- తెలకపల్లి : మండల విద్యా వనరుల కేం ద్రంలో శుక్రవారం మం డలంలోని పది పాఠశాల లకు సంబంధించి 469 మంది విద్యార్థుల ఏక రూప దుస్తులను డీపీఎం వెంకటేశ్‌ ఆధ్వ ర్యంలో ఎంఈవో చంద్రుడు చేతులమీదుగా హెచ్‌ ఎంలకు అందించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం బాలస్వామి, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సమాఖ్య ఏపీఎం నిరంజన్‌, సీసీ నిరంజన్‌, సుజాత, మమత, మహిళా సంఘాల సభ్యులు నాగలక్ష్మీ, విజయ, ప్రసన్న, లిఖిత, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఆర్‌సీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:04 PM