Share News

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ

ABN , Publish Date - Oct 25 , 2024 | 10:58 PM

మండల పరిధిలోని జిన్నారం, ఎక్లాస్‌పూర్‌, కన్మనూ ర్‌, చిత్తనూర్‌, బుడ్డగానితండా గ్రామాల లబ్ధిదా రులకు శుక్రవారం మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పం పిణీ చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ
చెక్కులు పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మరికల్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని జిన్నారం, ఎక్లాస్‌పూర్‌, కన్మనూ ర్‌, చిత్తనూర్‌, బుడ్డగానితండా గ్రామాల లబ్ధిదా రులకు శుక్రవారం మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రజా పాలనలో లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నంగి దేవేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ జమీల్‌, ఎంపీడీవో కొండన్న, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 10:58 PM