Share News

డిజిటల్‌ ఫ్యామిలీ కార్డు సర్వే పైలెట్‌ ప్రాజెక్టు పూర్తి

ABN , Publish Date - Oct 10 , 2024 | 11:39 PM

డిజిటల్‌ కార్డు ల సర్వే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

డిజిటల్‌ ఫ్యామిలీ కార్డు సర్వే పైలెట్‌ ప్రాజెక్టు పూర్తి

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన కుటుంబ డిజిటల్‌ కార్డుల స ర్వేను ప్రామాణికంగా తీసుకుని, ప్రభుత్వ ఆదేశాల మేర కు అన్నిగ్రామాల్లో నిర్వహించే కుటుంబ డిజిటల్‌ కార్డు ల సర్వే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ కే.సీతారామా రావు, దేవసహాయంతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో డిజిటల్‌ కార్డుల సర్వేపై సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల జారీకి సంబంధించి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన కుటుంబ డిజిటల్‌ కార్డుల సర్వేను పకడ్బందీగా పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా నిర్వహించిన డిజిటల్‌ కార్డుల సర్వే ప్రక్రియలో గుర్తించిన సమస్యలు, కుటుం బ వివరాల నమోదు తదితర వివరాలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు మునిసిపాలి టీల్లో నిర్వహించే కుటుంబ డిజిటల్‌ కార్డుల సర్వేను పైలెట్‌ ప్రాజెక్టుద్వారా చేపట్టిన డిజిటల్‌ కార్డుల సర్వేను ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో విజయవం తంగా డిజిటల్‌ కార్డుల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ప్రజలకు మెరుగైన సేవలందించాలని వైద్య సిబ్బం దిని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు. గురువారం నాగర్‌కర్నూల్‌ మండలం పెద్దముద్దునూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం కోసం వచ్చిన పలువురితో మాట్లాడి వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభా గంలో మందుల నిల్వలపై ఆరా తీశారు. రోజూ ఓపీ ఎంత నమోదవుతుందని మెడికల్‌ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరింత పెంచేందుకు చర్యలు తీసుకో వాలని చెప్పారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రసవాల సంఖ్య వ్యాక్సినేషన్‌, ఇమ్యూనైజేషన్‌ వంటి రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించా రు. ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులతో సౌమ్యంగా మాట్లాడాలని సూచించారు.

Updated Date - Oct 11 , 2024 | 07:32 AM