Share News

మద్యం డిపో ముందు ధర్నా

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:26 PM

తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు మద్యం డిపోలో హమాలీలుగా తమకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నిరుద్యోగ యువకులు దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేశారు.

మద్యం డిపో ముందు ధర్నా
మద్యం డిపో ముందు ధర్నా చేస్తున్న నిరుద్యోగ యువకులు

తిమ్మాజిపేట, జూన్‌ 12 : తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు మద్యం డిపోలో హమాలీలుగా తమకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నిరుద్యోగ యువకులు దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేశారు. నిరుద్యోగ యువకులకు డిపోలో పని చేసే హమాలీల మధ్య కాసేపు గొడవ జరగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అక్కడ చేరుకున్న పోలీసుల జోక్యంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. మద్యం డిపోలో ఇప్పటికే 70 మంది హమాలీలుగా పని చేస్తున్న మరికొందరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారు లు గతంలో తెలిపారు. గత కొన్నేళ్లుగా తమకు హమాలీలుగా పని చేయడానికి అవకాశం కల్పించాలని పలు పర్యాయాలు, ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు పలు పార్టీల మద్దతుతో చేశారు. కొందరు నిరుద్యోగ యువకులు కోర్టు ద్వారా అనుమతులు పొందామని హమాలీలుగా కొందరు పని చేయడానికి డిపోలో చేరారు. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు ఆందోళనకు దిగా రు. ఆన్‌లోడింగ్‌ వాహనాలను బయటకు వెళ్లకుండా లోడింగ్‌కు వీలు లేకుండా చేయడం పని కో సం వెళ్లినవారిని బయటకు పంపాలని డిమాండ్‌ చేస్తూ డిపో మేనేజర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్‌ నాయకులు, బీజేపీ నాయకులు మద్దతు పలికారు. నిరుద్యోగ యువకులకు, నాయకులకు డిపోలో ప్రస్తుతం పని చేస్తున్న హమాలీల మధ్య వాగ్వాదంతో ఘర్షణ జరిగే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను శాంతింపజేశారు. ఆ 12మందిని బయటకు పంపించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ మల్లురవి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజే్‌షరెడ్డిలకు ఫోన్‌ ద్వారా డిపో ముందు జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వివరించారు.

Updated Date - Jun 12 , 2024 | 11:26 PM