Share News

ధర్మమే గెలిచింది

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:56 PM

సుప్రీం కోర్టు తీర్పుతో ధర్మమే గెలిచిందని తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పో రాట సమితి వ్యవస్థాపకుడు ఇటుక రాజు పేర్కొన్నారు.

ధర్మమే గెలిచింది
విజయోత్సవ సభలో మాట్లాడుతున్న ఇటుక రాజు

- మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకుడు ఇటుక రాజు

- మాదిగ, మాదిగల ఉప కులాల విజయోత్సవ సభ

మరికల్‌, సెప్టెంబరు 21 : సుప్రీం కోర్టు తీర్పుతో ధర్మమే గెలిచిందని తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పో రాట సమితి వ్యవస్థాపకుడు ఇటుక రాజు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్‌ హాల్‌లో శనివారం గౌరవ అధ్యక్షుడు గండి బాల్‌రాజ్‌ అధ్యక్షతన ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ మాదిగ ఉపకులాల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల నుంచి మాదిగ ఉపకులాలతో కలిసి దండోరా ఉద్యమం కొనసాగించి నేడు విజయం సాఽఽధించామన్నారు. ఈ క్రమంలో మాదిగ బిడ్డలు ఎందరో అమరులైనట్లు తెలిపారు. ఫలితంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు నాలుగు సంవత్సరాల్లోనే 25వేల పైచిలుకు ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు. గండి బాల్‌రాజు మాట్లాడుతూ ఇటుక రాజు నాయకత్వంలో ఎస్పీ వర్గీకరణ మలిదశ ఉద్యమానికి మరోసారి ఊపిరి పోశారని అన్నారు. ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడుతూ దండోరా ఉద్య మాన్ని నిలబెట్టడానికి వర్గీకరణ సాధన కోసం అసెంబ్లీపైకి ఎక్కి దండోరా జెండా ఎగరవేసిన నాయకుడు అని కొనియాడారు. సుప్రీం కోర్టు ఏడుగురు ధర్మాసనంలో ఆరుగురు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఇటుక రాజు మాదిగ మండలానికి చేరుకోవడంతో మాదిగ ఉపకులాలు స్వాగతం పలికారు. డప్పులతో ర్యాలీగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళిఅర్పించారు. టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సిరసనోళ్ల బాల్‌రాజు మాదిగ, కార్యదర్శి జోగు రామస్వామి, రమేష్‌, జంగ య్య, ఆంజనేయులు నర్వ కృష్ణయ్య, ఎలుక బాల్‌ రాజు, కుందేటి వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 10:56 PM