అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:01 PM
అలంపూర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

- ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వినతి
అలంపూర్ చౌరస్తా, జూలై 8 : అలంపూర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖ్య మంత్రిని కలిసి సమస్యలను వివరించారు. రాయచూరు, అయిజ, శాంతి నగర్, వయా అలంపూర్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని నందికొట్కూరు, శ్రీశైలంను కలిపేలా అంతర్రాష్ట్ర రహదారి ఏర్పాటు చేస్తే అలంపూర్ క్షేత్రం అభివృద్ధి చెందుతుందని సీఎంకు వివరించారు. తుమ్మిళ్ల ప్రాజెక్ట్ లో భాగంగా మల్లమ్మకుంట, వల్లూరు, జులెకల్ రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నెట్టెంపాడు ప్యాకేజీ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలంపూర్ నియోజకవర్గ ప్రజ లకు కర్నూలు నగరంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు కృష్ణానదిలో మునిగిపోయి మరణించారని తెలిపారు. బాధిత కుటుం బానికి ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.