కలెక్టర్‌ను కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 20 , 2024 | 11:21 PM
వనపర్తి జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ్ సురభిని గురువారం ఆయన ఛాంబర్‌లో దేవర కద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కలిశారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూన్ 20 : వనపర్తి జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ్ సురభిని గురువారం ఆయన ఛాంబర్‌లో దేవర కద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి, పూలబొకె అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కలెక్టర్‌కు శుభాకాం క్షలు తెలిపారు.
మైనారిటీ నాయకుల సన్మానం
వనపర్తి టౌన్ : కలెక్టర్ ఆదర్శ్ సురభిని జిల్లా మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ.ఖాదర్‌పాషా, నాయకులు చాంద్‌పాషా, షాజద్ రసూల్‌షరీష్, రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేశ్వర్లు తదితరులు శాలువాతో సన్మానించి, పూలబొకేతో శుభాకాంక్షలు తెలిపారు.