Share News

నేడు మక్తల్‌కు ఉప ముఖ్యమంత్రి రాక

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:04 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మక్తల్‌ పట్టణానికి రానున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. సంగంబండ రిజర్వాయర్‌ కింద లో లెవల్‌ కెనాల్‌ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను ప్రారంభించడానికి వస్తున్నట్లు చెప్పారు.

నేడు మక్తల్‌కు ఉప ముఖ్యమంత్రి రాక
సంగంబండ సమీపంలో హెలీప్యాడ్‌, సభా స్థలిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎస్పీ యోగే్‌షగౌతమ్‌

మక్తల్‌, మార్చి 12: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మక్తల్‌ పట్టణానికి రానున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. సంగంబండ రిజర్వాయర్‌ కింద లో లెవల్‌ కెనాల్‌ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను ప్రారంభించడానికి వస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మక్తల్‌ పట్టణ సమీపంలోని సంగంబండ వద్ద ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌, బీకేఆర్‌ ఫౌండేషన్‌ అధినేత బాలకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే హెలీప్యాడ్‌, సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మక్తల్‌ మండలంలోని సంగంబండ లోలెవల్‌ కెనాల్‌లో ఉన్న బండరాయిని బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభకు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంత్రుల రాక సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ యోగే్‌షగౌతమ్‌ చెప్పారు.

Updated Date - Mar 12 , 2024 | 11:04 PM