Share News

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:39 PM

అనుమానాస్పద స్థితిలో యువకు డు మృతిచెందిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

చాదర్‌ఘాట్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో యువకు డు మృతిచెందిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. చాదర్‌ఘాట్‌ ఎస్‌ఐ భరత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం, శాంతినగర్‌ గ్రామనివాసి పింజారి మహ్మద్‌ ఫయాజ్‌(25) పోటీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఓల్డ్‌ మలక్‌పేటలోని వాహేద్‌ నగర్‌లో గల అబుబాకర్‌ మసీద్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఫయాజ్‌ నివాసముంటు న్న గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు చాదర్‌ఘాట్‌ పోలీసులు చేరుకుని ఫయాజ్‌ గది తలుపులు తెరచి చూడగా మృతిచెంది ఉన్నట్లుగా గుర్తించారు. నాలుగైదు రోజుల క్రితమే మృతిచెంది ఉంటాడని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడం ద్వారా స్పష్టమవుతున్నదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఫయాజ్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు మూర్చరోగంతో బాధపడుతున్నాడని, అతని మృతికి అది ఒక కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 11:39 PM