Share News

పట్ట పగలు చోరీ

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:44 PM

జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌ టీచర్స్‌ కాలనీలో సోమవారం పట్ట పగలే చోరీ జరిగింది. బాధితుడు మక్బూల్‌ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌ టీచర్స్‌కాలనీలో మక్బూల్‌ బాషా భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

పట్ట పగలు చోరీ

22 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరణ

వడ్డేపల్లి, మార్చి 11: జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌ టీచర్స్‌ కాలనీలో సోమవారం పట్ట పగలే చోరీ జరిగింది. బాధితుడు మక్బూల్‌ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌ టీచర్స్‌కాలనీలో మక్బూల్‌ బాషా భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. మండల కేంద్రం ఉండవల్లిలో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగా సోమవారం పాఠశాలకు బయల్దేరి, సాయంకాలం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం విరిగిపోయి ఉండటంతో లోపలికి వెళ్లి చూశారు. బెడ్‌రూంలో ఉన్న బీరువా తాళం కూడా విరగొట్టి కనిపించింది. అందులోని 22 తులాల బంగారం, 50 తులాల వెండి నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. శాంతినగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో ఏయే వస్తువులు పోయాయన్నది బాధితుడు పరిశీలిస్తున్నాడని సీఐ చెప్పారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి, క్లూస్‌ సేకరించి వివరాల ఆధారంగా విచారణ చేపట్టి తుదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Updated Date - Mar 11 , 2024 | 10:44 PM