Share News

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:52 PM

నారాయణపేట పేట జిల్లా కేంద్ర మండలంలోని లింగ ంపల్లిలో గల పత్తిమిల్లులో విద్యుదాఘాతంతో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. అధికారులు, ఫైర్‌ సిబ్బంది, గ్రామస్థుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే మిల్లులో పత్తిని జిన్నింగ్‌ చేసేటప్పుడు నిప్పు కణికలు పత్తిపై పడి అగ్నిప్రమాదంతో పత్తి కాలి బూడిదైంది.

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం
లింగ ంపల్లిలోని పత్తి మిల్లులో ఎగిసి పడుతున్న మంటలు

షాట్‌సర్క్యూట్‌తో పత్తి దగ ్ధమై రూ. 5 కోట్లు నష్టం

నారాయణపేట రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట పేట జిల్లా కేంద్ర మండలంలోని లింగ ంపల్లిలో గల పత్తిమిల్లులో విద్యుదాఘాతంతో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. అధికారులు, ఫైర్‌ సిబ్బంది, గ్రామస్థుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే మిల్లులో పత్తిని జిన్నింగ్‌ చేసేటప్పుడు నిప్పు కణికలు పత్తిపై పడి అగ్నిప్రమాదంతో పత్తి కాలి బూడిదైంది. మిల్లర్‌ రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని మిల్లు ఆవరణలో స్టాక్‌ చేయగా ఈ సంఘటన చోటు చేసుకున్నది. దీంతో మిల్లులోని కార్మికులు పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. ఫైర్‌ సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి మంటలను మిల్లులోకి వెళ్ళకుండా రెండు, మూడు అగ్రిమాపక వాహనాలతో నీటిని చల్లుతూ అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 10 వేల క్వింటాళ్ళ పత్తి అగ్నికి ఆహుతి కాగా సుమారు రూ. ఐదు కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని సిబ్బంది చెప్పారు. పంచనామా అనంతరం ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలుస్తుందన్నారు. ఘటనా స్థలాన్ని మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి, డీఎస్పీ లింగయ్య, రూరల్‌ ఎస్‌ఐ సి.రాముడు, మార్కెట్‌ కార్యదర్శి భారతి పరిశీలించి, కారణాలను తెలుసుకున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:52 PM