Share News

అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:37 PM

కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలని, రాష్ట్రంలోనే కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేద్దామని కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధికి సహకరించాలి
మాట్లాడుతున్న కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి

- రాష్ట్రంలోనే కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా మారుద్దాం

- సర్వసభ్య సమావేశంలో కొడంగల్‌ అభివృద్ధి కాడా అధికారి వెంకట్‌రెడ్డి

కోస్గి రూరల్‌, జనవరి 17 : కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలని, రాష్ట్రంలోనే కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేద్దామని కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ మధుకర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నియోజకవర్గం ఒక మోడల్‌గా తయారు చేద్దామని అందుకు అందరి సహకారం అవసరం అన్నారు. నేటి నుంచి 10 రోజుల్లో గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా గ్రామ స్థాయిలో తిరిగి రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవణాలతో పాటు ఇంకా ఏమైన అవసరం ఉన్నా తనకు తెలియజేయాలన్నారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. పీఆర్‌ఏఈ అంజిల్‌రెడ్డి ప్రజాప్రతినిధులకు స్పందించడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలో ప్రతి గ్రామం తిరిగి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఏ పనులు కావాలో ఎస్టిమేట్‌ వేయాలని ప్రత్యేకాధికారి, చంద్రవంచ సర్పంచ్‌ రఘువర్దన్‌రెడ్డి సూచించారు. అదే విధంగా మండలంలోని సారంగరావ్‌పల్లి గ్రామ పంచాయతీ భవణ నిర్మాణ వ్యవహరం రెండు వర్గాలతో పనులు నిలిచిపోయాయని, గ్రామస్థులతో మాట్లాడి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అనుమతితో త్వరలో పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం మండలంలో ఉన్న 86 అంగన్‌వాడీ కేంద్రాల్లో 33 మాత్రమే సొంత భవణాలు ఉన్నాయని, మిగిలినవి అద్దె భవణాలలోనే కొనసాగుతున్నాయని సూపర్‌వైజర్‌ సరోజ తెలిపారు. అంగన్‌వాడీలకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని కాడా అధికారి సూచించారు. అదే విధంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుందో సూచించాలన్నారు. అనంతరం ఈనెల 31తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుందని ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజాసేవ చేసి గౌరవ సభ్యులకు సభ ద్వార ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో కాళప్ప, వైస్‌ ఎంపీపీ సాయిలు పాల్గొన్నారు

Updated Date - Jan 17 , 2024 | 10:37 PM