Share News

నన్ను ఓడించేందుకు కుట్ర

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:15 PM

ఈ ప్రాంత ప్రజలకోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఆడబిడ్డను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను ఓడించేందుకు కుట్ర
నామినేషన్‌ పత్రం సమర్పిస్తున్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణ

- మహిళ అన్న గౌరవం లేదు : బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

- అట్టహాసంగా నామినేషన్‌

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 18: ఈ ప్రాంత ప్రజలకోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఆడబిడ్డను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అన్న గౌరవం లేకుండా అవమాన కరంగా మాట్లాడే వీరి మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గురువా రం డీకే అరుణ పాలమూరు పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు కాటన్‌మిల్లు వేంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేష న్‌ పత్రాలతో పూజలు చేశారు. అక్కడినుంచి నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పార్టీ ముఖ్యులతో కలిసి రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అక్కడి నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు ఆమె కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. పాలమూరు నుంచి తొలి మహిళా ఎంపీగా సేవ చేసే అవకాశం తనకు వచ్చిందని, ప్రజలు ఆశీర్వ దించాలని కోరారు. ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆ హామీలను అమలు చేసిన తరువాతనే ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడుగా తాను వాల్మీకి బోయల గురించి పార్లమెంట్‌లో, మాదాసి కురుమల గురించి అసెంబ్లీలో మాట్లాడానని, కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు బీసీల గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా ముదిరాజ్‌, బీసీలపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అనంతరం క్లాక్‌టవర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ వన్‌టౌన్‌ చౌరస్తా మీదుగా రాంనగర్‌, పాన్‌చౌరస్తా మీదుగా గడియారం చౌరస్తాకు చేరుకుంది. కార్యక్రమంలో నాయకులు రతంగ్‌ పాండురెడ్డి, పద్మజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:16 PM