Share News

మాదిగలకు కాంగ్రెస్‌ పార్టీ మొండి చెయ్యి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:14 PM

మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్‌ పార్టీ మొండిచెయ్యి చూపిం దని ఎమ్మార్పీఎస్‌ మండల కన్వీనర్‌ బల్గెర ఏసన్న విమర్శించారు.

మాదిగలకు కాంగ్రెస్‌ పార్టీ మొండి చెయ్యి
బల్గెర వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు

- ఎమ్మార్పీఎస్‌ మండల కన్వీనర్‌ బల్గెర ఏసన్న

- అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయింపు

గట్టు, ఏప్రిల్‌ 3 : మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్‌ పార్టీ మొండిచెయ్యి చూపిం దని ఎమ్మార్పీఎస్‌ మండల కన్వీనర్‌ బల్గెర ఏసన్న విమర్శించారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బల్గెర వద్ద అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాదిగలు కేవలం ఓట్లు వేసే యంత్రాలు కాద న్నారు. తాము తిరగబడితే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంలో మాదిగ అభ్యర్థులకు ఎంపీ టికెట్లు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్ణయాన్ని మార్చుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమన్నారు. దాదాపు గంట పాటు అందోళన కొనసాగడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయా యి. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఏస్‌ఐ రామకృష్ణ అక్కడకు చేరుకొని నాయకు లతో మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా కోకన్వీనర్‌ ఇమ్మానియల్‌, నాయకులు ముక్కేరన్న, బండా రి డేవిడ్‌, ఎంజీ నర్సింహులు, సామేల్‌, తిమ్మప్ప, సాకి సుదర్శన్‌, అజయ్‌, రాజేష్‌, డానియేలు, యోబు, యోహను పాల్గొన్నారు.

మాదిగలను మోసగించిన కాంగ్రెస్‌

గద్వాల టౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు తీరని ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పోగుల రాజేష్‌ ఆరోపించారు. దళితుల్లో ఇరవై శాతం దాటని మాలలకు రెండు సీట్లు, బైండ్ల కులానికి ఒక సీటు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, 75 శాతం ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీరును నిరసిస్తూ బుధవారం గద్వాల పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడు తూ మాది గలకు ద్రోహం చేసిన పార్టీలన్నీ తగిన మూల్యం చెల్లించుకున్నాయని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె స్‌ పార్టీకి గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని మాదిగలంతా ఏకమై, కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి పని చేస్తారని స్పష్టం చేశారు. ధర్నాలో నాయకులు భాస్కర్‌, అశోక్‌, కన్న మాదిగ, ఆంజనే యులు, పూడూరు చిన్నయ్య, పరుమాల నాగరాజు, ఆంజనేయులు, రత్నం, మోషే, కోళ్ల మహేష్‌, రాజు, తిమ్మప్ప పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:14 PM