Share News

గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:38 PM

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో చేతులెత్తేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

- బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

మక్తల్‌/నర్వ, ఏప్రిల్‌ 7 : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో చేతులెత్తేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం మక్తల్‌ పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్‌ హాల్‌లో మండల విస్తృత బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. మళ్లీ ఏం మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారన్నారు. మహిళలకు నెలకు రూ.2500, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15000, రూ.500లకే గ్యాస్‌ సిలిం డర్‌, పెన్షన్‌ రూ.4000, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వీటితో పాటు రైతులకు రూ.రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పేరిట ఉన్న బస్సులను కుదించి ప్రయాణికు లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారన్నారు. డబ్బులు ఇచ్చి ప్రయాణం చేద్దామ్న బస్సుల్లో ఎక్క లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో మోదీ మూడో సారి ప్రధాని కావాలని ప్రజలంతా కో రుకుంటున్నారన్నారు. దేశ ప్రజలందరికీ ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తుందన్నా రు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములై బీజేపీని ఆదరించి 400 స్థానాల్లో గెలిపించాలన్నారు. అదే విధంగా నర్వ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మండల స్థాయి బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తోడు దొంగల్లా ఉన్న సీఎం రేవంత్‌, కేసీఆర్‌ మోదీ వద్దకెళ్లి చేయి చాపనిదే వీళ్ల పబ్బం గడవదన్నారు. నోటి కొచ్చిన మాటలతో చేతగాని ఉచిత పథకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు పడాకుల శ్రీని వాస్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బాల్చెడ్‌ పావనీ, వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిల రాజశేఖర్‌రెడ్డి, కర్ని స్వామి, బాయికాటి రాజశేఖర్‌రెడ్డి, చిట్యాల లక్ష్మయ్య, కౌన్సిలర్లు అర్చన, కౌసల్య, ప్రసన్న, బలరాంరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, నాగూరావు నామాజీ, మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు లలితమ్మ, కుర్వ సత్యం, పీఆర్‌వో గోపాల్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు వెంకటయ్య, బీజేపీ నాయకులు బ్రహ్మనంద రెడ్డి, వెంకట్‌రెడ్డి, పరుశరాం రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:38 PM