Share News

ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ దాడులు

ABN , Publish Date - May 15 , 2024 | 11:10 PM

ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ దాడులకు పాల్పడుతోం దని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ దాడులు
నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

- పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు

- బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 15: ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ దాడులకు పాల్పడుతోం దని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రభుత్వ ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పరామర్శించారు. ఈ సందర్భం గా ఆర్‌ఎస్‌పీ మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలం చి న్నకార్పాముల గ్రామంలో మూడు రోజుల క్రితం బీఆర్‌ ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ దాడులు చేశారని పేర్కొన్నా రు. పోలీసులు దాడి చేసిన వారిని శిక్షించాల్సింది పోయి వారికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దాడి సంఘ టనపై మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డితో పాటు తానూ స్వయంగా వెళ్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పై దాడి చేసిన కాంగ్రెస్‌ నాయకులపై చర్యలు తీసుకోక పోతే బాధితులతో కలిసి రాష్ట్ర కమిషన్‌, మానవ హక్కు ల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చ రించారు. జడ్పీటీసీ స భ్యుడు శ్రీశైలం, నాయ కుడు మంగి విజయ్‌, కౌన్సిలర్‌ ఖాజాఖాన్‌ త దితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తోంది

అచ్చంపేటటౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం దా డులను ప్రోత్సహిస్తుం దని మాజీ ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు అన్నా రు. బుధవారం పార్ల మెంట్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మా ట్లాడారు. పట్టణంలోని 2వవార్డు సభ్యురాలు నిర్మల బా లరాజుపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దా డులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దాడి జరిగినా ఖం డించకపోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు ప్రజల పక్షాన నిలవాలని ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. భయభ్రాంతులకు గురిచేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా రు. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్న చూసీ చూడనట్లు వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే అవమానమన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడంలో ఎమ్మెల్యే వైఖరి ఏంటో చెప్పాల న్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:10 PM