Share News

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:09 PM

ప్రజావాణికి ప్రాధాన్యం ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, జనవరి 29 : ప్రజావాణికి ప్రాధాన్యం ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో కలెక్టర్‌ ఫిర్యాదుదారుల నుంచి ఆర్జీలను స్వీకరించి, మాట్లాడారు. ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ ప్రజావాణిలో తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తొమ్మిది మంది ఆర్జీలను మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ ద్వారా పేట ప్రజావాణి విభాగానికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా అందాయి. సంబంధిత ఫిర్యాదు దారులతో కలెక్టర్‌ మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌ ఏవోకు వినతి..

అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు ఇవ్వాలని టీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏవోను కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వివిధ పథకాలకు సంబంధించి దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు కూలి రూ.600 చెల్లించాలని, ఏడాదిలో 200 రోజులు పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాయకులు బాలప్ప, శివ కుమార్‌, బాలకృష్ణ, సుదర్శన్‌, నర్సిములు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:09 PM