Share News

ముంపు రైతులకు పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:39 PM

గణప సముద్రం రిజ ర్వాయర్‌లో భూములు కోల్పోతున్న ముంపు రైతులకు ఎకరాకు 30 లక్షలు చెల్లించాల్సిందేనని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు.

ముంపు రైతులకు పరిహారం చెల్లించాలి
ఖిల్లాఘణపురంలోని గణప సముద్రం జలాశయం పనులను పరిశీలిస్తున్న ఎండీ జబ్బార్‌

ఖిల్లాఘణపురం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గణప సముద్రం రిజ ర్వాయర్‌లో భూములు కోల్పోతున్న ముంపు రైతులకు ఎకరాకు 30 లక్షలు చెల్లించాల్సిందేనని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం వ నపర్తి జిల్లా రైతు కమిటీ ఆధ్వర్యంలో ఖిల్లాఘణపురంలోని గణప సముద్రం ను, భూ నిర్వాసితుల సమస్యలను రై తు సంఘం జిల్లా బృందం అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా రైతు సం ఘం రాష్ట్ర నా యకులు ఎండీ జబ్బార్‌ మాట్లా డారు. ఘణప సముద్రం జలాశయాన్ని రూ. 47.73 కోట్లతో నిర్మిం చడంతో మండల కేంద్రం లోని 360 మంది రైతులకు సంబంధించిన 420 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ముంపు నకు గురవుతున్నాయని గుర్తు చేశారు. రిజర్వా యర్‌ నిర్మాణంలో భాగంగా పాత అలుగు కంటే ఒక మీటర్‌ ఎత్తు పెంచి అలుగు నిర్మాణం చేప ట్టడంతో ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామంలోని ఇళ్లలోకి నీరు ఊట ఊరే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలుగు ఎత్తు పెంచవద్దని డిమాండ్‌ చేశారు. భూములు కో ల్పోతున్న రైతు లకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం బహిరంగ మార్కెట్‌ ధరకు అనుగు ణంగా ఎకరాకు 30 లక్షలు పైగా ఇవ్వాలని అ న్నారు. జలాశయం చెరువు కట్ట పనుల ని ర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు.

నాణ్యమైన పనులు చేపట్ట కుంటే ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామ న్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి.బాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్య క్షుడు దేవేందర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు మహేష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:39 PM