Share News

శాంతిభద్రతల పరిరక్షణకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్‌’

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:10 PM

నేరాల నిర్మూలనకు, శాంతిభద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్‌’
ప్రజలతో మాట్లాడుతున్న డీఎస్పీ సత్యనారాయణ

- డీఎస్పీ సత్యనారాయణ

- ధ్రువపత్రాలు లేని 38 వాహనాలు స్వాధీనం

గద్వాల క్రైం, జూలై 31 : నేరాల నిర్మూలనకు, శాంతిభద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో బుధవారం రాత్రి సీఐ భీంకుమార్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఐదుగురు ఎస్‌ఐలు, ముగ్గురు ఆర్‌ఎస్‌ఐలు, 54 మంది పోలీస్‌ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమంతో ప్రజల రక్షణ, భద్రత, రక్షణ కల్పించడంతో పాటు, కొత్త వ్యక్తులు, నేరస్థుల ఆచూకీని తెలుసుకునేందుకు తోడ్పడుతుం దని తెలిపారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు కూడా తెలుస్తాయ న్నారు. వాహనదారులు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలు, కార్డులు కలిగి ఉండాలన్నారు. మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, మహిళలు, చిన్నపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించి, తిరిగి ఇస్తామని చెప్పారు. అపద, అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు. ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటారన్నారు. వ్యాపార సముదాయాలు, కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవా లన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. కాలనీల్లో కొత్త వ్యక్తులు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:10 PM