Share News

నల్లమలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:47 PM

నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచు పెంట ల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను శక్రవారం కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పరిశీలిం చారు.

  నల్లమలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌
పర్హాబాద్‌ చౌరస్తాలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

దోమలపెంట, ఏప్రిల్‌ 12: నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచు పెంట ల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను శక్రవారం కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగబోయే నాగర్‌కర్నూ ల్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ కేందాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నియోజక వర్గం పరిధిలోని ప ర్హాబాద్‌ చౌరస్తా, కుడిచింతలబావి, సార్లపల్లి, ఇంకాండ్‌ టన్నల్‌ (దోమలపెంట) గ్రామాలలో నూతనం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆ యా పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులకు, వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా ర్యాంపులు నిర్మించాలని, తాగునీరు, ఫర్నీచర్‌, మరుగు దొడ్లు సమకూర్చాలన్నా రు. ఎన్నికల్లో ఓటర్లు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అచ్చంపేట ఆర్డీవో మాదవి, అమ్రాబాద్‌ ఎంఆర్‌వో సరిత, ఆర్‌ఐ కృష్ణ తదిలరులు ఉన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:47 PM