Share News

జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:58 PM

జర్నలిస్టుల సమ స్యల పరిష్కారంపై సమష్టిగా పో రాడుతూ హక్కులను సాధించు కోవాలని తెలంగాణ వర్కింగ్‌ జ ర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్య క్షుడు మామిడి సోమయ్య పిలు పునిచ్చారు.

జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం
జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన లొట్టి శ్రీనివాస్‌ను సన్మానిస్తున్న యూనియన్‌ నాయకులు

- టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

- పేట జిల్లా ద్వితీయ మహాసభలో నూతన కార్యవర్గం ఎన్నిక

నారాయణపేట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమ స్యల పరిష్కారంపై సమష్టిగా పో రాడుతూ హక్కులను సాధించు కోవాలని తెలంగాణ వర్కింగ్‌ జ ర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్య క్షుడు మామిడి సోమయ్య పిలు పునిచ్చారు. గురువారం నారా యణపేట లక్ష్మీ బాంకిట్‌ హాల్‌లో టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. అర్హులైన వారికి అక్రిడిటేషన్‌ కార్డులు ఇప్పించేందుకు ఫెడరేషన్‌ చర్యలు తీసుకుంటోందని, ఇళ్ల స్థలాల సాధన కో సం ఉద్యమించాలన్నారు. అనంతరం జిల్లా నూ తన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా లోట్టి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షు డిగా నర్సిములు, కార్యదర్శిగా మాధవ్‌, సహాయ కార్యదర్శిగా ఖాజాఅబ్దుల్‌, ఖాలీక్‌, కోశాధికారిగా లింగంతో పాటు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ను ఎన్నుకున్నారు. అలాగే తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ అనుబంధ బ్రాడ్‌కాస్ట్‌ కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి, గోపాల్‌, బాల్‌రామ్‌, కౌన్సిలర్‌ మహేష్‌, అంజిలయ్యగౌడ్‌, ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నరేష్‌, పృథ్వీరాజ్‌, డేవిడ్‌ తదితరులున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:58 PM