సీఎం ప్రయత్నాలు ఫలించలేదు
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:55 PM
పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు.

- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
- రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీదే కీలకపాత్ర
-పేట కృతజ్ఞత సభలో ఎంపీ డీకే అరుణ
నారాయణపేట టౌన్, జూలై 8 : పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. పాలమూరు ప్రజలు నరేంద్ర మోదీ పాలనలో ఎంపీగా తనను ఆశీర్వదించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్‌లో సోమవారం జరిగిన కృతజ్ఞత సభకు ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి తనపై పురుష పదజాలాన్ని ఉపయోగించారని, ఆయన మాటలను ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పారన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో 11 సార్లు వచ్చి ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని తనను గెలిపించారన్నారు. నారాయణపేట నియోజకవర్గం నుంచే తనకు ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చినట్లు తెలిపారు. అంతే నమ్మకంతో ఈ ప్రాంత అభివృదిధకి కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పేట నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా, కౌన్సిలర్లుగా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులను ఎంపీ డీకే అరుణ సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సింహులు, సత్యయాదవ్, నర్సన్‌గౌడ్, రఘురామయ్యగౌడ్, సత్యరఘుపాల్, సాయిబన్న, తిరుపతిరెడ్డి, మిర్చి వెంకటయ్య, రఘువీర్‌యాదవ్ పాల్గొన్నారు.
కలిసికట్టుగా పనిచేద్దాం
మక్తల్, జూలై 8 : మక్తల్ ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తానని మహబూబ్‌నగర్ పార్ల మెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వినయోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలిసివస్తే సంపూర్ణ సహాకారం అందిస్తానన్నారు. సంగంబండ, భూత్పూర్ ముంపు గ్రామాలకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం నుంచి అంబేడ్క ర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ర్యాలీగా ద్వారక ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్త లు గజమాలతో డీకే అరుణను ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పడాకుల శ్రీని వాసులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కొండ య్య, బంగ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కర్ని స్వామి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, సోమశేఖర్ గౌడ్, దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్, బాల్చెడ్ మల్లికార్జున్, రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ అఖిల రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు ప్రస న్న, అర్చన, కౌసల్య, బీజేవైఎం నాయకులు మహేష్ సాగర్, మంజునాథ్, నర్సింహాలు పాల్గొన్నారు.