Share News

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:10 PM

సమాజంలో బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
మాట్లాడుతున్న కార్యదర్శి రజిని

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని

వనపర్తి రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళ లకు, వరద బాధితులకు రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలిపారు. అదేవిఽ దంగా ఉచిత న్యాయ సలహా పొందేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 15100కు ఫోన్‌ చేయాలని అన్నారు. 18ఏళ్లు నిండిన అమ్మాయికి, 21 ఏళ్లు ఉన్న అబ్బాయికి వివాహం చేయాలని, చిన్న వయ సులో చేయడం వల్ల అమ్మాయిలకు ఆరోగ్య స మస్యలు, పుట్టే పిల్లలకు పౌష్టికాహార లోపంతో ఉంటారన్నారు. చిన్నప్పుడే వివాహం చేయడం వల్ల చదువు ఆగిపోతుందని, దానివల్ల భవిష్యత్‌ పాడై వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అన్నారు. న్యాయవాది కృష్ణయ్య, సఖి కేంద్రం నిర్వాహకులు కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 11:10 PM