Share News

జోగుళాంబ సన్నిధిలో చండీహోమం

ABN , Publish Date - May 23 , 2024 | 11:14 PM

వైశాఖ పౌర్ణమి సందర్భంగా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయ ఆవరణలో గురువారం చండీ హోమాన్ని శక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

జోగుళాంబ సన్నిధిలో చండీహోమం
అమ్మవారి సమక్షంలో కుంకుమార్చన చేస్తున్న మహిళలు

- భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన

అలంపూర్‌, మే 23 : వైశాఖ పౌర్ణమి సందర్భంగా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయ ఆవరణలో గురువారం చండీ హోమాన్ని శక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహిళలు కుంకుమార్చన చేశారు. మహిళలకు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సాయి ప్రతాప్‌ రెడ్డి, నంద్యాల అడిషనల్‌ ఎస్పీ ప్రవీణ్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అద నపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

భక్తులందరికీ భోజనం అందించాలి

అలంపూర్‌ క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ భోజనం అందించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ జ్యోతి ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని గురువారం ఆమె హైదరాబాద్‌లో పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులతో మాట్లాడారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Updated Date - May 23 , 2024 | 11:14 PM