Share News

చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:33 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా అండర్‌-23 క్రికెట్‌ టోర్నీలో చాంపియన్‌ మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జట్టు రన్నర్‌గా నిలిచింది.

  చాంపియన్‌ మహబూబ్‌నగర్‌
రన్నర్‌గా నిలిచిన నాగర్‌కర్నూల్‌ జట్టు

- రన్నర్‌గా నిలిచిని నాగర్‌కర్నూల్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా అండర్‌-23 క్రికెట్‌ టోర్నీలో చాంపియన్‌ మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జట్టు రన్నర్‌గా నిలిచింది. ఆదివారం బోయపల్లి సమీపంలో ఎండీసీఏ మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 203 పరుగుల తేడాతో నాగర్‌ర్నూల్‌ జట్టుపై గెలిచి విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. జట్టులో అబ్దుల్‌ రాఫె 91 బంతుల్లో 13 ఫోర్లు ఒక సిక్స్‌తో అర్ధసెంచరీ (95) చేయగా, అక్షయ్‌ 104 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ(118) సాధించాడు. నాగర్‌కర్నూల్‌ బౌలర్లలో అబినవ్‌తేజ, అఫ్రిది, జశ్వంత్‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నాగర్‌కర్నూల్‌ జట్టు 24.4 ఓవర్లలో 105 పరుగులకు అలౌట్‌ అయ్యింది. జట్టులో వంశీ 28, అఫ్రిది 15 పరుగులు చేశాడు. మహబూబ్‌నగర్‌ బౌలర్లలో ముఖిత్‌ 3, అర్జున్‌, దినేశ్‌ చెరో వికెట్లు తీసి జట్టు విజయానికి బాటలు వేశారు. టోర్నీలో 246 పరుగులు చేసి అక్షయ్‌ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా, 8 వికెట్లు తీసి ముఖిత్‌ బెస్ట్‌ బౌలర్‌గా, 197 పరుగులు, 5 క్యాచ్‌ అవుట్‌ చేసిన అబ్దుల్‌రాఫె ఉత్తమ అల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు.

క్రికెట్‌లో జిల్లా క్రీడాకారులు రాణించాలి

క్రికెట్‌లో జిల్లా క్రీడాకారులు రాణించి రాష్ట్ర జట్టుకు ఎంపికావాలని జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శు రాజశేఖర్‌ అన్నారు. టోర్నీలో ఫైనల్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు రోజులుగా ఆయా జట్ల క్రీడాకారులు చక్కటి ప్రతిభ చాటారని, క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని, త్వరలో జరగనున్న హెచ్‌సీఏ టోర్నీలో జట్టు పాల్గొంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి జిల్లా జట్టు ప్రతిభ చాటాలని ఆకాక్షించారు. ఎండీసీఏ ప్రతినిధులు సురేష్‌కుమార్‌, వెంకటరామరావు, కృష్ణమూర్తి, కోచ్‌లు గోపాల్‌కృష్ణ, అబ్దుల్లా పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 11:33 PM