Share News

గ్రామాల వనరుల అధ్యయనానికి కేంద్ర బృందం పర్యటన

ABN , Publish Date - May 20 , 2024 | 11:25 PM

గ్రామాల్లో వన రులపై కేంద్ర పరిశోధన బృందం పర్యటనకు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు.

 గ్రామాల వనరుల అధ్యయనానికి కేంద్ర బృందం పర్యటన
కలెక్టరేట్‌లో అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 20: గ్రామాల్లో వన రులపై కేంద్ర పరిశోధన బృందం పర్యటనకు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 24 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేసే అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు ఎంపిక చేసి న నాలుగు మండలాల పరిధిలోని ఐదు గ్రామా లను సందర్శించి గ్రామీ ణ ఆర్థిక, సామాజిక స్ధితిగతులను, కేంద్ర ప్ర భుత్వం ఆధ్వర్యంలో అ మలు చేస్తున్న పథకాల పై అధ్యయనం చేయ నున్నారని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ మండ లం చందుబట్ల, గన్యా గుల, అల్లాపూర్‌ గ్రామా లతో పాటు బిజినేపల్లి, తెలకపల్లి గ్రామాలను కేంద్ర బృందం పర్యటిం చున్నారన్నారు. డీఆర్‌ డీఏ పీడీ చిన్నఓబులేష్‌, డీపీవో కృష్ణ, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖ అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికా రులు తదితరులు పాల్గొన్నారు.

తెలకపల్లి : మండలానికి స్టడీ టూర్‌ ని మిత్తం ఆరుగురు ట్రైనీ ఐఏఎస్‌ల బృందం గ్రా మ పంచాయతీ తెలకపల్లికి సోమవారం చేరు కున్నారు. వారు సోమవారం నుంచి 24వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయు చున్న పథకాలు, అభివృద్ధి పనులు మొదలైన అంశాలపై క్షేత్ర పరిశీలన చేస్తారని ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. వారికి కావాల్సిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవడానికి ఇదివరకే సూచనలు చేయడం జరిగింది.

Updated Date - May 20 , 2024 | 11:25 PM