Share News

కుక్కల బీభత్సం

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:13 PM

రోజు రోజుకూ వీధి కుక్కలు బీభత్సవాన్ని సృష్టిస్తున్నాయి.

 కుక్కల బీభత్సం
రోడ్డుపై సంచరిస్తున్న వీధి కుక్కలు

- 15 రోజుల్లో 26 మేక పిల్లలను చంపిన కుక్కలు

హన్వాడ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రోజు రోజుకూ వీధి కుక్కలు బీభత్సవాన్ని సృష్టిస్తున్నాయి. మరీ ఇళ్లలోకి వచ్చి ఎగబడి కరుస్తున్నాయి. మండల కేంద్రమైన హన్వాడలో గత 15 రోజుల వ్యవధిలో 26 మేక పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. వీటిలో కొన్నింటిని చంపి తినగా, మరి కొన్నింటిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో మేకల పెంపకం దారులు కుక్కలను చూసి భయపడుతున్నారు. గ్రామానికి చెందిన అక్కపల్లి శేఖర్‌, భీమమ్మ, శ్రీనివాసులుతో పాటు 11 మందికి సంబంధించిన మేకలు, మేక పిల్లలను కుక్కలను కరిచాయి. ప్రధానంగా చికెన్‌, మటన్‌ షాప్‌ల వారు వ్యర్థాన్ని రోడ్లపై వేయడంతో కుక్కలు మాంసాహారానికి అలవాటు పడి మేకలు, గొర్రెల పిల్లలపై దాడి చేసి చంపి తింటున్నట్లు స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:13 PM