Share News

జములమ్మ హుండీ లెక్కింపు

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:41 PM

జములమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన హుండీలను శుక్రవారం లెక్కించారు.

జములమ్మ హుండీ లెక్కింపు
హుండీలోని నగదును లెక్కిస్తున్న వలంటీర్లు, నైవేద్యం తీసుకొస్తున్న బండ్ల జ్యోతి

- సమకూరిన రూ.27.28 లక్షలు

- 12 కిలోల వెండి, 28 గ్రాముల బంగారం

గద్వాల, మార్చి 22 : జములమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన హుండీలను శుక్రవారం లెక్కించారు. అంతకుముందు ఆలయ అధికారులు వెంకటేశ్వరమ్మ, పురేందర్‌కుమార్‌, చైర్‌పర్సన్‌ కుర్వ గాయత్రి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుంకుమార్చన మండపంలో భక్తుల సమక్షంలో హుండీలను తెరిచి, వలంటీర్ల సహకారంతో నగదు, బంగారం, వెండి కానుకలను లెక్కించారు. 45 రోజులకు గాను రూ.27.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో పురేందర్‌కుమార్‌ తెలిపారు. మిశ్రమ వెండి 12 కేజీల 200 గ్రాములు, మిశ్రమ బంగారం 28 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. గత ఏడాది కంటే రూ.80 వేలు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. నగదు, కానుకలను బ్యాంకులో జమచేయ నున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగు లు మురళీధర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాష్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, మద్దిలేటి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి

జములమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరశురాముడి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆమె వెంట ఆలయ మాజీ చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌, మాజీ డైరెక్టర్‌ కమ్మరి రాము, రాధమ్మ, మధుమతి తదితరులున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 10:42 PM