మారుమూల గ్రామాలకూ బస్సు సౌకర్యం
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:20 PM
మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

- పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి
- కొత్లాబాద్ బస్సు పునఃప్రారంభం
- చెలిమిల్ల వద్ద బస్సును స్వాగతించిన మండల నాయకులు, ప్రజలు
గండీడ్, జూన్ 17 : మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పరి గి డిపోలో పరిగి నుంచి వయా చెలిమిల్ల, రంగా రెడ్డిపల్లి, పగిడ్యాల్ మీదుగా కొత్లాబాద్ వరకు వెళ్లే బస్సును ఆయన ప్రారంభించారు. నాలుగేళ్ల నుంచి పైగ్రామాలకు బస్సును నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘బస్సు సౌకర్యం కల్పించరూ’ శీర్షికన గతనెల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైనట్లు ఆయా గ్రామాల నాయ కులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం బస్సును పునః ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బస్సు రాకతో జిన్నారం, కొత్లాబాద్ గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు రవాణా కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి తేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తుందని అన్నారు. కాగా, చెలిమిల్ల, పగిడ్యాల్ గ్రామం వద్ద బస్సుకు ఆయా గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. పీసీసీ సభ్యుడు నరసింహరావు, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, బి.గోపాల్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆశిరెడ్డి, బాలస్వామి, వెంకట్‌యాదవ్, విజయ్‌కుమార్, పరిగి డీఏం పవిత్ర, ఆర్టీసీ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.