Share News

తాళం పగులగొట్టి చోరీ

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:16 PM

జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌ చౌరస్తాలో మూడు చోట్ల చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జ్యోతి అనే మహిళ చౌరస్తాలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ చిరువ్యాపారం చూస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల మూడున కుటుంబ సభ్యులతో కర్నూలులోని బంధువుల ఇంటికి వెళ్లి గురువారం తిరిగి వచ్చారు.

తాళం పగులగొట్టి చోరీ

మరో చోట బైక్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

ఇంకో చోట మొబైల్‌ దుకాణంలో దొంగతనం

అలంపూర్‌ చౌరస్తా, జూన్‌ 7 : జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌ చౌరస్తాలో మూడు చోట్ల చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జ్యోతి అనే మహిళ చౌరస్తాలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ చిరువ్యాపారం చూస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల మూడున కుటుంబ సభ్యులతో కర్నూలులోని బంధువుల ఇంటికి వెళ్లి గురువారం తిరిగి వచ్చారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండి, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువలో ఉన్న ఏడు తులాల బంగారం, రూ.26 వేలు చోరీకి గురైనట్లు తెలుసుకుని శుక్రవారం ఉండవల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ నాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాయచూరు రహదారిలోని ఓ భవనంలోని గదిలో బుక్కాపురం గ్రామానికి చెందిన గజేంద్ర అద్దెకు ఉంటూ, ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన గురువారం రాత్రి పల్సర్‌ బైక్‌ను ఇంటి ముందు నిలిపి, నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను ఎత్తుకెళ్లారు. అలంపూర్‌కు వెళ్లే దారిలో రాజు అనేవ్యక్తికి చెందిన ముబైల్‌ షాపు తాళాలు పగులగొట్టి రూ.10 వేల విలువైన సామగ్రిని దొంగిలించారు.

Updated Date - Jun 07 , 2024 | 11:17 PM