Share News

నల్గొండకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:56 PM

నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించి బహిరంగ సభకు ధన్వాడ మండల కేం ద్రంతో పాటు కిష్టాపూర్‌, ధన్వాడ, గోటూర్‌, రాంకిష్టాయ్యపల్లి గ్రామాల నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

నల్గొండకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు
మరికల్‌ నుంచి తరలివెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ధన్వాడ, ఫిబ్రవరి 13 : నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించి బహిరంగ సభకు ధన్వాడ మండల కేం ద్రంతో పాటు కిష్టాపూర్‌, ధన్వాడ, గోటూర్‌, రాంకిష్టాయ్యపల్లి గ్రామాల నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మండల ప్రధాన కార్య దర్శి చంద్రశేఖర్‌, గున్ముక్ల ఎంపీటీసీ సభ్యుడు సుధీర్‌ కుమార్‌ వెళ్లిన వారిలో ఉన్నారు.

మరికల్‌ : బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లంబడి తిరుపతయ్య ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో జరిగే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. కృష్ణారెడ్డి, హుసేన్‌, అనంతరెడ్డి, వెంకట్‌రెడ్డి తరలివెళ్లిన వారిలో ఉన్నారు.

మాగనూరు : మాగనూరు బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు మంగళవారం నల్గొండ బీఆర్‌ఎస్‌ సభకు తరలివెళ్లారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు పల్లె మా రెప్ప, అశోక్‌గౌడ్‌, అమ్మపల్లి నర్సింహులు, వడ్వాటు మాజీ సర్పంచు నర్సింహులు, మల్లారెడ్డి, జయనందరెడ్డి తరలివెళ్లారు.

దామరగిద్ద : తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది జలాలు కేఆర్‌ఎంబీకి అప్పగించిన సందర్భంగా తెలంగాణ రైతాంగానికి నష్టం వాటిల్లుతుందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్గొండలో చేపట్టిన బహిరంగ సభకు దామరగిద్ద మండల నాయకులు తరలివెళ్లారు. పుట్టి అంజి, మాణిక్యప్ప, అశోక్‌, రాములు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:56 PM