Share News

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:21 PM

అమరచింత జడ్పీటీసీ సభ్యుడు బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం మరువకముందే ఆ పార్టీకి మరో షాక్‌ తగి లింది.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అమరచింత, ఆత్మకూరు నాయకులతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- పార్టీని వీడిన ఆరు గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు

అమరచింత/ఆత్మకూరు, ఏప్రిల్‌ 19: అమరచింత జడ్పీటీసీ సభ్యుడు బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం మరువకముందే ఆ పార్టీకి మరో షాక్‌ తగి లింది. తాజాగా మండలంలోని ఆరు గ్రామాల మాజీ సర్పంచులు, సింగిల్‌విండో డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నా యకులు మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పీసీసీ కల్లుగీత డిపార్ట్‌మెంట్‌ చైర్మన్‌ కేశం నాగరాజు గౌడ్‌ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు పరమే ష్‌, మాజీ అధ్యక్షుడు రహమతుల్లా ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:21 PM