Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:28 PM

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులకు లక్ష్యంతో చదివి భవిష్యత్తులో రాణించాలని కోరారు.

 ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్‌
కొండారెడ్డిపల్లిలో విద్యార్థులకు దుస్తులను అందజేస్తున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఎంపీ మల్లు రవి

కల్వకుర్తి, జూన్‌ 12: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులకు లక్ష్యంతో చదివి భవిష్యత్తులో రాణించాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల పునఃప్రారంభమయ్యాయి. కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవ డానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడమే కాకుం డా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు పెరిగేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థులకు చదువుతోపాటు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకుని ఉన్నత రంగాల్లో రాణించిన వారు చాలా మంది ఉన్నారని తెలి పారు. బడి బయట పిల్లలు ఎవరూ ఉండవద్దని, అలాంటి వారిని గుర్తించి బడిలో చే ర్పించాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశ గా ముందుకెళ్లాలని చెప్పారు. విద్యార్థులు నాలెడ్జ్‌ నైపుణ్యం, వ్యక్తిగత వికాసం, ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్‌, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను కలెక్టర్‌ పంపిణీ చేశారు. డీఈవో గోవిందరాజులు, పీడీ డీఆర్‌డీఏ చిన్నఓబులేష్‌, డీపీవో కృష్ణ, కల్వకుర్తి ఆర్డీవో ఎస్‌.శ్రీను, కల్వకుర్తి తహసీల్దార్‌ ఇబ్రహీం, ఎంఈవో బాసునాయక్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, హెచ్‌ఎం, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

వంగూరు: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ అని పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన కార్యక్రమానికి నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, కలెక్టర్‌ పాల్గొన్నా రు. విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. న్యాక్‌ సంస్థ నుంచి మంజూరైన 35 కుట్టు మిషన్లను మహిళలకు పంపిణీ చేశారు. జడ్పీటీ సీ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, ఎంపీపీ భీమమ్మ, డీపీవో కృష్ణ, డీఈవో గోవిందరాజులు, తహసీల్దార్‌ కిరణ్మయి, ఎంఈవో శంకర్‌నాయక్‌, నాయకులు కృష్ణారెడ్డి, వేమారెడ్డి, పులిజాల కృష్ణారెడ్డి, లాలుయాదవ్‌, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:28 PM