Share News

పుట్టెడు దుఃఖంలో అన్నదాతలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:40 PM

వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో ఏ గ్రామంలో చూసినా రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారని మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మార్పు.. మార్పు.. అంటే ఏం మార్పు వస్తుందోనని వారి మాటలు నమ్మి ఓటు వేస్తే పంటలు ఎండిపోతున్నాయని, రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, తాగడానికి నీటి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.

పుట్టెడు దుఃఖంలో అన్నదాతలు
రైతు దీక్షలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

కరువు తరుముకొస్తోంది

మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

పాలమూరులో బీఆర్‌ఎస్‌ రైతు దీక్ష

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 6: వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో ఏ గ్రామంలో చూసినా రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారని మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మార్పు.. మార్పు.. అంటే ఏం మార్పు వస్తుందోనని వారి మాటలు నమ్మి ఓటు వేస్తే పంటలు ఎండిపోతున్నాయని, రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, తాగడానికి నీటి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఎండిన వరి మెదళ్లతో రైతుదీక్ష చేపట్టింది. ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డితో కలిసి దీక్షలో పాల్గొన్న శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏరోజైనా పంటలు ఎండిపోయాయా? అని ప్రశ్నించారు. బోర్లు లేకుండా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు ఇచ్చామని, ఇప్పుడు బోరు బావులను రిపేర్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో తాగడానికి నీరు లేక కోతులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయని, రైతులంతా బాధలో ఉన్నారని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో ఇదే తరహాలో హామీలిచ్చి చేతులు ఎత్తేశారన్నారు. రేపు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూస్తామన్నారు. బుడ్డిబుడ్డి కేసులు.. ఉడత బెదిరింపులకు కార్యకర్తలు భయపడొద్దని, అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. పార్టీని వీడి వెళ్ళిన వారిని వెళ్లనివ్వండని, ఉన్నోళ్లే నిఖార్సైన కార్యకర్తలని, వారికే భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో పాలమూరు-రంగారెడ్డిని తొందరగా పూర్తిచేస్తారని, అనుకున్నామని కానీ ఇంకా పనులు ప్రాంభించలేదన్నారు. రైతులకు రూ.500 బోనస్‌, ఎండిన ప్రతీ ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, కోరమోని వెంకటయ్య, గంజి ఎంకన్న, అబ్దుల్‌ రహమాన్‌, సుఽధాశ్రీ, బాలరాజు, శివరాజు, కరుణాకర్‌ గౌడ్‌, గోపాల్‌ యాదవ్‌ తాటి గణేస్‌, కట్టా రవికిషన్‌రెడ్డి, వడ్ల శేఖర్‌, రాజేశ్వర్‌రెడ్డి, నవకాంత్‌, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 10:40 PM