జిల్లా కలెక్టర్‌గా బీ.ఎం.సంతోష్‌కుమార్
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:12 PM
జోగుళాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.ఎం.సంతోష్ నియమి తులయ్యారు.
- ప్రస్తుత కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డికి బదిలీ
గద్వాల న్యూటౌన్, జనవరి 3 : జోగుళాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.ఎం.సంతోష్ నియమి తులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021, సెప్టెంబరు ఒకటిన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు క్రాంతి సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో టీఎస్ పీఎస్‌సీలో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్న (2017బ్యాచ్) బీఎం సంతోష్ నియమితులయ్యారు. త్వరలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.