Share News

ఎస్సీ వర్గీకరణలో బీజేపీ పాత్ర శూన్యం

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:54 PM

మూడు దశాబ్దాలు కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ అంశంలో పదేళ్లుగా అధి కారంలో ఉన్న బీజేపీ పాత్ర శూన్యమని తెలంగాణ మా దిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ సీని యర్‌ నాయకుడు దేవని సతీష్‌ మాదిగ అన్నారు.

 ఎస్సీ వర్గీకరణలో బీజేపీ పాత్ర శూన్యం
నాగర్‌కర్నూల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఎండీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దేవని సతీష్‌ మాదిగ

- మందకృష్ణ మాదిగ బీజేపీ కండువా వేసుకో

- బహుజనుల ఆత్మగౌరవాన్ని దొరల వద్ద తాకట్టు పెట్టిన ఆర్‌ఎస్‌పీ

- పిలుస్తే పలికే మల్లు రవిని గెలిపిద్దాం

- విలేకరుల సమావేశంలో తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దేవని సతీష్‌ మాదిగ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7: మూడు దశాబ్దాలు కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ అంశంలో పదేళ్లుగా అధి కారంలో ఉన్న బీజేపీ పాత్ర శూన్యమని తెలంగాణ మా దిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ సీని యర్‌ నాయకుడు దేవని సతీష్‌ మాదిగ అన్నారు. ఆది వారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కూచ కుళ్ల దామోదర్‌రెడ్డి నివాసంలో సతీష్‌మాదిగ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని చె బుతున్న ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ బీజేపీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఏం చేసిందో ప్రజల కు సమాధానం చెప్పాలని డి మాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ ను 2004 సుప్రీకోర్టు కొట్టివేసే నాడు అధికారంలో ఉన్న కాంగ్రె స్‌ ప్రభుత్వం ఉషా మెహరా కమిషన్‌ వేసిందని పేర్కొన్నా రు. అంతే కాకుండా మాదిగల కు న్యాయం జరగాలని సు ప్రీంకోర్టులో న్యాయవాదులను పెట్టి కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ వర్గీకరణ కోసం వాదించిందని, సుప్రీకోర్టు రిజర్వులో ఉన్న తీర్పుకు కూడా కాంగ్రెస్‌ వేసిన ఉషా మెహరా కమిషనే సాక్ష్యమన్నారు. దళితుల ను చిన్న చూపు చూసే బీజేపీకి వత్తాసు పలుకుతున్న మందకృష్ణ మాదిగ తన మెడలో నల్ల కండువా తీసి బీజేపీ కండువా వేసుకుంటే బాగుండని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీలో చేరానని అబద్దాలు చెబుతున్న నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు కేవలం తన కుమారుడి టికెట్‌ కోసమే బీజేపీలో చేరారని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో ఎన్నో చట్టాల ను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం మాదిగలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకోవడం తప్పితే చిన్న అంశమైన వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు. బీ ఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బహుజన వాదా న్ని దొరల కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడం లో నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి పాత్ర కీలకమన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటులో వరుసగా ఐదు సార్లు గెలిచిన మాదిగలు ఒక్కసారి ఇత రులకు కూడా అవకాశం ఇద్దామని, పిలిస్తే పలికే మల్లు రవికి మాదిగలంతా ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించా లని ఆయన కోరారు. కౌన్సిలర్‌ కొత్త శ్రీనివాసులు, మా జీ జడ్పీటీసీ సభ్యురాలు వంకేశ్వరం మణెమ్మ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీనివాస్‌ బహుదూర్‌, వంకేశ్వరం లక్ష్మయ్య, రాంచందర్‌, మిద్దె మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:54 PM