Share News

బీజేపీ విజయోత్సవ సంబురాలు

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:00 PM

జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు.

బీజేపీ విజయోత్సవ సంబురాలు
మక్తల్‌లో సంబురాలు జరుపుకుంటున్న బీజేపీ నాయకులు

- బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ

- యువకుల బైక్‌ ర్యాలీ

నారాయణపేట, జూన్‌ 4 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఓట్ల లెక్కంపు ప్రక్రియ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఉత్కంఠ భరితంగా కొనసాగగా, బీజేపీ ఎంపీగా డీకే అరుణ స్వల్ప మెజార్టీతో గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. నారాయణపేటలోని నర్సిరెడ్డి చౌరస్తా, పాత బస్లాండ్‌ చౌరస్తా, సెంటర్‌ చౌక్‌ బజార్‌ చౌరస్తాలో బాణాసంచా కాల్చారు. పుర వీధుల గుండా యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. పళ్ల పదవ వార్డులో బీజేపీ శ్రేణులు బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

మక్తల్‌ : మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థిగా డీకే అరుణ విజయం సాధించడంతో మంగళవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు మక్తల్‌ పట్టణం, గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా చివరకు తమ పార్టీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించిందన్నారు. అరుణమ్మ విజయానికి కృషి చేసిన ఓటర్లు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కావలి వెంకటేష్‌, చాకలి హన్మంతు, మహేష్‌ సాగర్‌, వాకిటి ఆంజనేయులు, సాయి, సందపురం చంద్రశేఖర్‌, శివరాములు, సూర్యటైలర్‌ ఆంజనేయులు, బొంబాయి రాజు, జావెద్‌, వెంకటేష్‌, కొలిమి ఆంజనేయులు పా

Updated Date - Jun 04 , 2024 | 11:00 PM