Share News

బీజేపీ రోడ్‌ షో సక్సెస్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:04 PM

బీజేపీ నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు అభ్యర్ధి భరత్‌ప్రసాద్‌ తన మూడో సెట్‌ నామినేషన్‌ అనంతరం పట్టణంలో నిర్వ హించిన రోడ్‌షో సక్సెస్‌ అయ్యింది.

బీజేపీ రోడ్‌ షో సక్సెస్‌

- భరత్‌ ప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు

- పాల్గొన్న గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌

రోడ్‌ షోలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 25: బీజేపీ నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు అభ్యర్ధి భరత్‌ప్రసాద్‌ తన మూడో సెట్‌ నామినేషన్‌ అనంతరం పట్టణంలో నిర్వ హించిన రోడ్‌షో సక్సెస్‌ అయ్యింది. బస్‌ డిపో నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. మహిళల కోలాటాలు, కళాకారుల డప్పులు, కార్యకర్తల బైక్‌ ర్యాలీతో పట్టణమంతా కాషాయ మయమైంది. ర్యాలీ అంబేడ్కర్‌ కూడలికి చేరుకోగానే బీజేపీ ఎంపీ అభ్యర్ధి పోతుగంటి భరత్‌ప్రసాద్‌ అంబ్కేడర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌ రావు అధ్యక్షతన నిర్వహించిన కార్నర్‌ మీటింట్‌లో ముఖ్య అతిథులతో పాటు జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజీ ఆచారి, ఎంపీ పోతుగంటి రాములు, అభ్యర్ధి భరత్‌ ప్రసాద్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా తల్లోజు అచారి మాట్లాడుతూ పూటకో పార్టీ, గంటకో పార్టీ మారే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎప్పుడో ఎంపీగా పని చేసిన మల్లు రవిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ తాను ఎంపీగా పని చేసిన ఐదేళ్ల కాలంలో ఏం చేశారని ప్రశ్నించే వారు తన హయంలోనే కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు రూ.1,500 కోట్లతో జాతీయ రహదారి తెచ్చిన సంగతి గుర్తించాలన్నారు. ఎంపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ మాట్లాడుతూ జడ్పీ చైర్మన్‌ కాకుండా అడ్డుకున్న నాడే ఎంపీగా చట్ట సభల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపిస్తే మోదీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల చీఫ్‌ ఏజెంట్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి దిలీప్‌, నాయకులు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:04 PM