Share News

పక్షుల సంరక్షణ సామాజిక బాధ్యత

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:33 PM

జీవ వైవిధ్యంలో కీలక భూమిక పోషిస్తున్న పక్షుల సంరక్షణను సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా అభిప్రా యపడ్డారు.

పక్షుల సంరక్షణ సామాజిక బాధ్యత
అరుదైన పక్షుల నమూనాలను ప్రదర్శిస్తున్న అధ్యాపకులు

- డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కలందర్‌ బాషా

గద్వాల టౌన్‌, జనవరి 5 : జీవ వైవిధ్యంలో కీలక భూమిక పోషిస్తున్న పక్షుల సంరక్షణను సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా అభిప్రా యపడ్డారు. గద్వాల పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ పక్షుల దినోత్సవాన్ని జీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సి పాల్‌ మాట్లాడుతూ పక్షులు అంతరించి పోకుండా అడవుల పెంప కాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా జూవాలజీ మరియు లైఫ్‌ సైన్స్‌ విభాగాల అధిపతులు వివిధ రకాల పక్షి జాతుల నమూనాలను ప్రదర్శించారు. వాటి వివరాలు, ప్రత్యేకతలు, శాస్ర్తీయ నామాలను వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి. శ్రీపతినాయుడు, అధ్యాపకులు డాక్టర్‌ లవీన మంజులత, కృష్ణమూర్తి, హరిబాబు, మనోజ్‌కుమార్‌, కరుణాకర్‌, నాగేందర్‌, వెంకటేశ్వరమ్మ, హరి నాథ్‌, ఎల్లస్వామి ఉన్నారు.

అధ్యాపకుడికి అభినందన

ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా పీహెచ్‌డీ పట్టా అందుకున్న కళాశాల అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ రాంపాటి నాగేందర్‌ను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు. వృక్ష శాస్ర్తానికి సంబంధించిన ఓయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసిన నాగేందర్‌కు ఇటీవలే డాక్టర్‌ పట్టా లభించింది.

Updated Date - Jan 05 , 2024 | 11:33 PM