మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:51 PM
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌తో కలిసి ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు.

- ఎంపీహెచ్‌ను అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
- వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరా
వనపర్తి వైద్యవిభాగం, జనవరి 12: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌తో కలిసి ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై నేరుగా రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో, అస్పత్రి ఆవరణలో ప్రజలకు కావాల్సిన వసతులు, ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలపై వైద్యాధికారు లతో మాట్లాడి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రోగులకు అందిస్తున్న భోజనం గురించి వాకాబు చేశారు. శుభ్రత పాటించాలని, మెనూ ప్రకారం భో జనం అందించాలని, వంటలు రుచికరంగా చేయా లని, ప్రతీ రోజు పండ్లు, గుడ్డు తప్పనిసరిగా ఇవ్వాల న్నారు. ఎంసీహెచ్ వెనుక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్మాణం లో వాడుతున్న సీకులు, సిమెంట్ వివరాలను సంబంధిత కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సీటీ స్కాన్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రకుమార్, సీఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ రవిశంకర్, హెచ్‌వోడీలు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ కిరణ్‌మై, డాక్టర్ రాజ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ బంగారయ్య, డాక్టర్ చంద్రమోహన్, మునిసిపల్ కమిషనర్ విక్రమసింహ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో అమలు చేయాలి
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
పాన్‌గల్ : కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ మిశ్రాలు అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి అన్నారం తండాలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీవో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.