Share News

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - May 30 , 2024 | 11:10 PM

ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ సిబ్బందిని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ

గద్వాల న్యూటౌన్‌, మే 30 : ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని పాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎమ్‌ఎల్‌హెచ్‌పి)లతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణులు, బాలిం తలు, శిశువులకు వైద్య సేవలు అందించాలని చెప్పా రు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, ఇమ్యూనైజేషన్‌ రిజిస్టర్‌, డ్యూలిస్ట్‌ రిజిక్టర్లను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. షుగర్‌, బీపీ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులు ఇవ్వాలని, వ్యాధి తీవ్రంగా ఉన్నన వారిని జిల్లా అసుపత్రికి పంపించాలని సూచించారు. అనుమానిత క్షయ రోగులను గుర్తించి టీబీ యూనిట్‌కు పంపించాలని చెప్పారు. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేయాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే సర్వే నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్ధప్ప, డాక్టర్‌ రాజు, సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, నరేంద్రబాబు, మాధవి, రామాంజనేయులు, సాధిక్‌, రాజ్‌కుమార్‌, కల్యాణి పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:10 PM