Share News

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - May 20 , 2024 | 11:00 PM

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, మే 20 : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం నిర్వహించిన జిల్లా వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పాటైన ఉండవల్లి, కేటీదొడ్డి, ఎర్రవల్లి మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు స్ధలాలను గుర్తించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేట్‌ భవనాల్లో కొనసాగుతున్న సబ్‌సెంటర్ల వివరాలను కూడా తెలిపితే, నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు టీబీ, లెప్రసీ, మలేరియా, ఎయిడ్స్‌ నివారణ, ఇమ్యునైజేషన్‌, మాతాశిశు సంరక్షణ, సంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల నివారణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ర్టేషన్‌ తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్ధప్ప పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:00 PM