భక్తిశ్రద్ధలతో బక్రీద్
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:21 PM
ముస్లింల ప్రధానమైన పండుగల్లో ఒకటైన బక్రీద్ వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

- జిల్లా వ్యాప్తంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు
- ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ తదితరులు
నాగర్‌కర్నూల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : ముస్లింల ప్రధానమైన పండుగల్లో ఒకటైన బక్రీద్ వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఈద్గాలు, మసీద్‌లను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగ సందర్భంగా ఆర్థిక స్తోమత కలిగిన ప్రతీ ముస్లిం ఖుర్బానీ ఇస్తారు. పొట్టేళ్ల మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి పేదలు, బంధువులకు, ఇంటి అవసరాలకు అందిస్తారు. ఇదే బక్రీద్ పండుగ ప్రత్యేకత. బక్రీద్ పర్వదినం సందర్భంగా నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తిలో కశిరెడ్డి నారాయణరెడ్డిలు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.