భక్తి శ్రద్ధలతో బక్రీద్
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:16 PM
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపు కున్నారు.

- జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
- పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు
నారాయణపేట, జూన్ 17 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపు కున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గా వద్దకు వెళ్లి ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేనుగోపాల్, సుధాకర్, సరాఫ్ నాగరాజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ ఎండీ సలీం, అమిరోద్దీన్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఆయా పార్టీల నాయకులు గందె చంద్రకాంత్, రమేష్, వెంకుగౌడ్, మల్‌రెడ్డి, హస్నోద్దీన్, మైనోద్దీన్, సర్ఫరాజ్, నవాజ్, మూస, మైమూద్‌చ, యూసూఫ్ తాజ్ పాల్గొన్నారు.