Share News

త్యాగానికి, ధాతృత్వానికి ప్రతీక బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:17 PM

త్యాగనిరతికి, ధాతృత్వానికి బక్రీద్‌ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

త్యాగానికి, ధాతృత్వానికి ప్రతీక బక్రీద్‌
గద్వాల పట్టణంలోని ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఘనంగా బక్రీద్‌ వేడుకలు

- ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

గద్వాల/ గద్వాల టౌన్‌, జూన్‌ 17 : త్యాగనిరతికి, ధాతృత్వానికి బక్రీద్‌ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పట్టణ సమీపంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ఈద్గా మైదానం అభివృద్ధికి నాలుగేళ్లుగా సాగుతున్న ప్రయత్నం కార్యరూపం దాల్చడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మైనార్టీలకు అండగా ఉండి, వారి అభ్యున్నతికి తనవంతు తోడ్పాటునందిస్తాననన్నారు. ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ మున్నాబాషా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గద్వాల మండల పరిధిలోని గోనుపాడు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ బాబర్‌, డీసీసీ బ్యాంక్‌ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ ఎంఏ సుభాన్‌, గట్టు ఎంపీపీ విజయ్‌, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు, నాయకులు బలిగెర హనుమంతు, గోవిందు, నవీన్‌ రెడ్డి, భాస్కర్‌, నరసింహులు, రమేష్‌, సీతారాములు, మన్యం, ప్రవీణ్‌ ఉన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:17 PM