Share News

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:14 PM

కోటకొండ, కొల్లంపల్లి, జాజాపూర్‌, పేరపళ్ల గ్రామాల్లో సోమవారం బక్రీద్‌ పండుగ ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌
మద్దూర్‌ ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు

- ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

- శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

అధికారులునారాయణపేట రూరల్‌, జూన్‌ 17 : కోటకొండ, కొల్లంపల్లి, జాజాపూర్‌, పేరపళ్ల గ్రామాల్లో సోమవారం బక్రీద్‌ పండుగ ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ధన్వాడ : మండల కేంద్రంలో సోమవా రం బక్రీద్‌ పండుగను మైనార్టీ సోదరులు ఘ నంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాం గ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జట్రం లక్ష్మయ్యగౌడ్‌, నరేందర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు చీరాల కొండారెడ్డి మైనార్టీ సోదరులకు పండుగ శుభా కాంక్షలు తెలిపారు. ఎంనోన్‌పల్లిలో మైనార్టీ సో దరులు ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించగా, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గౌని శ్రీనివాసులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సోదరులు కందనూర్‌ రహిమన్‌ఖాన్‌, షాఈర్‌ హుస్సెన్‌, అజిమొద్దీన్‌, మహ్మద్‌ రఫీ, మైబెలి, బాబు, ఖాదర్‌ పాషా, యూసూఫ్‌, హుస్సెన్‌ ఖయ్యూం పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని మం తన్‌గోడ్‌, చిట్యాల, కర్నీ, జక్లేర్‌, లింగంపల్లి, గు డిగండ్ల గ్రామాల్లో ముస్లిం సోదరులు సోమ వారం బక్రీద్‌ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యే క ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మద్దూర్‌ : మండలంలోని మద్దూర్‌తో పాటు ఖాజీపూర్‌, దంగాన్‌పూర్‌, రెనివట్ల, నం దిపాడ్‌, పలెర్ల, దోరేపల్లి గ్రామాల్లో బక్రీద్‌ వేడు కలను ముస్లిం సోదరులు సోమవారం ఘనం గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఊరేగిం పుగా ఈద్గాలను వెళ్లి ఈద్‌-ఉల్‌-అదా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మద్దూర్‌లో అనవాయతీ ప్రకారం కరణం కుటుంబం, గ్రామ పంచాయ తీ, జమే మసీద్‌ ఇమామ్‌ స్వగృహంలో ఇడెం పంచిపెట్టి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపా రు. అనతరం ఖుర్బానీ రూపంలో పేదలకు మాంసం పంచిపెట్టారు. జామె మసీద్‌ ఇమాం లు, సదర్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:14 PM