బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:51 PM
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహత్మా జ్యోతిరావు ఫూలే అని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రకిరణ్ అన్నారు.

పాలమూరు యూనివర్సిటీ, నవంబరు (ఆంధ్రజ్యోతి) 28 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహత్మా జ్యోతిరావు ఫూలే అని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రకిరణ్ అన్నారు. గురువారం పీయూలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.జ్యోతిరావు ఫూలే సాధారణ బీసీ కుటుంబంలో జన్మించి బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని కొనియాడారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యం.కృష్ణయ్య, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తొలి సామాజిక వేత్త జ్యోతిరావు ఫూలే
జడ్చర్ల : సామాజిక స్పృహ కలిగించిన భారతదేశ తొలి సామాజిక వేత్త మహత్మాజ్యోతిరావు ఫూలే అని వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. గురువారం జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వితంతువులకు, అనాధలకు ఆశ్రయం కల్పించి సేవలు అందించారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు కృష్ణయాదవ్, జగన్, లక్ష్మీదేవి, వడ్లని శేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.
బడుగుల అభివృద్ధికి ఫూలే కృషి
పాలమూరు : బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభివృద్ధికి పాటు పడిన మహానుభావుడు మహాత్మాజ్యోతిరావు ఫూలే అని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జే.ఎం జాన్‌వెస్లీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఫూలే వర్ధంతి సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్, ఆర్.వెంకట్రాములుతో కలిసి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజా సంఘాల నాయకులు యం.ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పూలే వర్థంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం.మాణిక్యంరాజు, యం.కుర్మయ్య, ఆదివిష్ణు, రాజు, నందు, భాస్కర్, సురేష్, విజయ్ పాల్గొన్నారు.