Share News

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:45 PM

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌ అన్నారు. గురువారం మండలంలోని ఇప్పటూర్‌ గ్రామంలో ఆయన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
ఇప్పటూర్‌లో నిర్వహించిన బడిబాట ర్యాలీలో పాల్గొన్న డీఈవో రవీందర్‌

- ఈనెల 12న పాఠశాలల్లో వందశాతం హాజరు ఉండాలి 8 డీఈవో రవీందర్‌

- ఇప్పటూర్‌లో బడిబాట ప్రారంభం 8 గ్రామాల్లో ఉపాధ్యాయుల ర్యాలీలు

నవాబ్‌పేట, జూన్‌ 6 : బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌ అన్నారు. గురువారం మండలంలోని ఇప్పటూర్‌ గ్రామంలో ఆయన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదే శానుసారం ప్రతీ గ్రామంలో ఉన్న బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని ఇందుకోసం గ్రామ పెద్దలు, తల్లి దండ్రులు, యువకులు, ఉపాధ్యాయులు నిర్విరామం గా కృషి చేయాలని కోరారు. మారుమూల పల్లెల్లో ఉన్న పిల్లలకు చదువు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ బడిలో చదివే పిల్లలకు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, స్థానిక ప్ర జాప్రతినిధుల చేతులమీదుగా అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూన్‌ 12న వంద శాతం హాజరుశాతం ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌, హెచ్‌ఎం రామకృష్ణ, ప్రత్యేకాధికారి బాలుయాదవ్‌, నోడల్‌ అధికారి నాగ్యనాయక్‌, నర్సింహులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పారుపల్లిలో...

కోయిలకొండ : మండలంలోని పారుపల్లిలో బడి బాట కార్యక్రమాన్ని ఏఎంవో శ్రీనివాస్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. పాఠశాలల ప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర సామగ్రిని విద్యార్థులకు ఉచితంగా అందిస్తామన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను కో రారు. బడీడు వచ్చిన విద్యార్థుల ఇంటికి వెళ్లి అడ్మి షన్‌ చేయించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారి మధుసూదన్‌గౌడ్‌, ఎంపీడీవో కాళప్ప, ఎంఈవో లక్ష్మణ్‌సింగ్‌, సీఆర్‌పీ శంకర్‌తో పాటు, పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

పెద్దఆదిరాలలో...

జడ్చర్ల : జడ్చర్ల మండలంలోని పెద్దఆదిరాల, కోడ్గ ల్‌, గంగాపూర్‌, పోలేపల్లి, వల్లూరు గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉపాధ్యా యులంతా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఉన్నతమైన, నాణ్యతతో కూడిన విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో వ సతులు, సౌకర్యాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లయ్య, వెంకటయ్య, కృష్ణనాయక్‌, తాహెర్‌, సరస్వతి, రవిలతో పాటు మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- మిడ్జిల్‌ : మండలంలోని వస్పుల, దోనూర్‌, కొత్తపల్లి, అయ్యవారిపల్లి, వెలుగొమ్ముల, రాణిపేట, చిలువేరు గ్రామాలతో పాటు, పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గురువారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం వెంకటయ్య, హెచ్‌ఎంలు ఇందిరరాణి, చంద్రకళ, లక్ష్మయ్య, నెహెమ్యా, గురుప్రసాద్‌, మంజుల, మల్లయ్య, ఉపాధ్యాయులు మోహన్‌, గౌతమి, సునిత, భానుప్రకాష్‌రాజ్‌, నిసత్‌జాహన్‌ తదితరులున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 10:45 PM