Share News

పాలనా వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:05 PM

పాలనా వ్యవస్థపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు.

పాలనా వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి
మాక్‌పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులతో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు

- అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు

- ఎంఏఎల్‌డీ కళాశాలలో మాక్‌ పార్లమెంట్‌

గద్వాల టౌన్‌, మార్చి 11 : పాలనా వ్యవస్థపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడుస్తున్న తీరు, విశిష్టత, ప్రాముఖ్యత గురించి విధిగా తెలుసుకోవాలన్నారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రజలకు పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహించే పాలక, ప్రతిపక్షాలు, దేశాభివృద్ధి, సంక్షేమం, రక్షణ, పరిశ్రమల పురోగతి తదితర అంశాల్లో తీసుకునే నిర్ణ యాలు, సాగే పరిపాలనపై క్లుప్తంగా వివరించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విశిష్ఠతను వివరించారు. నెహ్రూ యువకేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి బి.కోటా నాయక్‌ మాట్లాడుతూ మాక్‌ పార్లమెంట్‌ నిర్వహిం చడం వల్ల వ్యవస్థపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు స్పీకర్‌గా, ప్రధాన మంత్రిగా, మంత్రులుగా, ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చేతులమీదుగా వారికి మెమొంటోలు, ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీపతినాయుడు, అధ్యాపకులు, నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు అనీల్‌, రాజేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 11:05 PM